పిడుగురాళ్ల జనసేన నేతల అరెస్ట్

గురజాల, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు శాంతి యుతంగా నిరసన తెలుపుతున్న నేపద్యంలో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయదాన్ని కామిశెట్టి రమేష్ తప్పుబట్టారు. పిడుగురాళ్ల పట్టణంలోని రంగ బొమ్మ సెంటర్లో శాతి యుతుంగా నిరసన తెలువుతున్న జనసేన నాయకులు, కార్యకర్తలను పట్టణ సిఐ ఆంజనేయులు అరెస్ట్ చేశారు. రమేష్ ను బలవంతంగా కారులో పోలీస్ స్టేషన్ కి తరలించారు. రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు ఉందని, చివరకు దాన్ని కూడా ముఖ్యమంత్రి కాలరాస్తున్నారని రమేష్ అన్నారు. రాష్ట్రంలో నియంత పాలన నడుస్తుందని దీనికి చరమగీతం పాడాల్సిన సమయం అసన్నమైందని అన్నారు. అధికార పార్టీ నాయకులకు పోలిసులు సపోర్ట్ చేయడం బాధాకరమని రమేష్ అన్నారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం అమలు చేస్తున్నారని, అందుకే నిరసన తెలిపే అవకాశం కూడా లేకుండా అరెస్టులు చేస్తున్నారని జనసేన నాయకుడు నూతి సూరినారాయణ అన్నారు. ఇలాగే కోన సాగితే రాష్ట్రంలో ప్రజా స్వామ్యం ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో జానపాడు గ్రామ అధ్యక్షుడు పసుపులేటి నరసింహారావు, మండల ఉపాధ్యక్షుడు బేతంచర్ల ప్రసాద్, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.