తిరుపతిలో జనసేన నాయకులు అరెస్ట్

తిరుపతి, శనివారం హైదరాబాదు నుంచి విజయవాడకు వస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తూ తిరుపతి జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్ ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఆదివారం తిరుపతి లో పోలీసులు కిరణ్ రాయల్, రాజారెడ్డి, బాబ్జీ, మధు బాబు, రాజేష్ ఆచారి, కొండా రాజమోహన్, పార్డు, హేమంత్, రమేష్, నాగరాజు, లక్ష్మి, లావణ్య, దుర్గాదేవి, చందన, కిషోర్, మనోజ్, షరీఫ్, లోహిత్, నాగరాజు రాయల్, పురుషోత్తం, సాయికుమార్, నవీన్, సుబ్బు యాదవ్, లోకేష్ మరియు ముఖ్య నేతలను అరెస్టు చేసి ఎం.ఆర్ పల్లి పోలీస్ స్టేషన్ కు తరలించి వారిని నిర్బంధించారు. ఈ సందర్భంగా కిరణ్ రాయల్, మాట్లాడుతూ మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ను అడ్డుకుంటే చూస్తూ జనసైనికులము ఊరుకోమని, మంగళగిరిలో మా పార్టీ కార్యాలయంలో పీ.ఏ.సీ సమావేశానికి విచ్చేస్తున్న మా అధినేత పవన్ కళ్యాణ్ ని పోలీసులు అడ్డుకున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రతిపక్షాలపై అధికార పార్టీ చేస్తున్న ఆగడాలను నిరసిస్తూ చలో విజయవాడకు పిలుపునిస్తే మమ్మల్ని అక్రమంగా అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించటం ఏంటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.