విశాఖపట్నం, జమ్మూ కాశ్మీర్‌లోని పెహల్గాం ప్రాంతంలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖ వాసి జరజాపు సత్య చంద్రమౌళి పెద్దకర్మకు శనివారం జనసేన నేతలు హాజరయ్యారు. జనసేన పార్టీ తరఫున పర్యావరణ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య, విశాఖ తూర్పు నియోజకవర్గ నాయకులు భోగిల శ్రీనివాస పట్నాయక్, కూటమి నాయకులు పాల్గొని చంద్రమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా వారు చంద్రమౌళి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఆయన చేసిన త్యాగాన్ని జనసేన పార్టీ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని తెలిపారు.
Share this content:
Post Comment