కాకినాడ రూరల్ నియోజకవర్గం, కరప మండలం, కరప పోలీస్ స్టేషన్ లో గత నెల 24వ తేదీన శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి పార్టీకి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీడియా సమావేశంలో దురుద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదల పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే మరియు జనసేన పార్టీ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ ఆదేశాలతో కరప మండల సీనియర్ జనసేన నాయకుడు భోగిరెడ్డి కొండబాబు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి భోగిరెడ్డి గంగాధర్ ఆధ్వర్యంలో గోదావరి జిల్లాల ఎన్నికల నిర్వహణ కో-కన్వీనర్ నున్న గణేష్ నాయుడు, కరప పోలీస్ స్టేషన్ ఎస్సై పి సునీతకి ఫిర్యాదు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి పప్పులు మళ్ళీ బాబు, గోన ఆంజనేయులు, యాళ్ల వీర వెంకట సత్యనారాయణ, యాళ్ల హరినాథ్, జిల్లెల్ల ప్రసాద్, చిన్నారి శ్రీనివాస్, నక్క బ్రహ్మాజీ, శాఖ వంశీ తదితర జనసేన నాయకులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment