వాసగిరిపై వైసిపి నాయకుల వ్యాఖ్యలు ఖండించిన జనసేన నాయకులు

గుంతకల్, కసాపురం రోడ్డు, స్థానిక వాసగిరి మణికంఠ క్యాంప్ కార్యాలయంలో జనసేన నాయకులు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా, గుంతకల్ పట్టణం, మండల జనసేన శ్రేణులు మాట్లాడుతూ, వాసగిరి మణికంఠ మంచితనం, ఆయన సేవా సత్కార్యాలు మరియు నాయకత్వ లక్షణాలు గురించి వివరించారు. “ఉన్నత విద్యావంతుడు, వ్యాపారవేత్త, సేవాతత్పరుడు, అన్నింటికీ మించి మెగా కుటుంబానికి వీర విధేయుడు అయిన వాసగిరి మణికంఠ విధేయత గురించి నియోజకవర్గం ప్రజలకు తెలుసు. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి, మన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు, ఆయన్ను గుంతకల్ నుండి జిల్లా కార్యదర్శిగా నియమించారు. ఆ తర్వాత నాలుగు సంవత్సరాలు పార్టీ కష్ట కాలంలో గుంతకల్ నియోజకవర్గంలో పార్టీని చురుగ్గా ముందుకు తీసుకుని వెళ్లారు. 2024 నవంబర్ లో ఆయన గుంతకల్ నియోజకవర్గంలో జనసేన పార్టీ బాధ్యుడిగా నియమితులయ్యారు,” అన్నారు. వాసగిరి మణికంఠ, తన ఆరోగ్యం బాగా లేకపోయినా, గుంతకల్ నియోజకవర్గంలోని కూటమి ఎమ్మెల్యే గెలుపు కోసం నిస్వార్థంగా కృషి చేసిన విధానాన్ని కూటమి నాయకులు మెచ్చుకున్నారు. “కరోనా విపత్కర సమయంలో, గుంతకల్ నియోజకవర్గం చిరంజీవి ఉచిత ఆక్సిజన్ బ్యాంకు ఇంచార్జిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించి, ప్రాణవాయువు అందక ఇబ్బంది పడుతున్న కరోనా బాధితులకు అండగా నిలిచారు. ఆయన సేవా కార్యక్రమాలు, కోవిడ్ సమయంలో వందలాది మందికి అన్నదానం, నిత్యావసర సరుకులు అందించడం, పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆసుపత్రికి ఆక్సిజన్ వెంటిలేటర్ వితరణ చేయడం, తదితర సేవా కార్యక్రమాలు అపారమైనవి,” అని సభా సభ్యులు చెప్పారు. ఇలాంటి నిజాయితీ గల నాయకుని విమర్శించడం, “వైసీపీ నాయకులు భవిష్యత్తులో తమ అవినీతి (భూకబ్జాలు, మట్టి మరియు ఇసుక దోపిడీ) బయటపడకుండా విమర్శిస్తున్నారని” జనసేన శ్రేణులు వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో, జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు బండి శేఖర్, మండల అధ్యక్షుడు పురుషోత్తం, జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యుడు శ్రీ పవర్ శేఖర్, చిరంజీవి యువత అధ్యక్షుడు పాండు కుమార్, జనసేన వీర మహిళ బండి చంద్రకళ, సీనియర్ నాయకులు కసాపురం నందా, కథల వీధి అంజి, గాజుల రాఘవేంద్ర, ధోనిముక్కల విజయ్, సుబ్బయ్య, సుంకర నాగరాజు, ముద్దులపురం ప్రసాద్, అమర్, అఖిల్, పామయ్య, ధనుంజయ, కసాపురం రామాంజనేయులు, మురళి, మల్లి, బ్రహ్మయ్య, హేమంత్, ఆటో రామకృష్ణ, అనిల్ కుమార్, బి.వంశీ, నెలగొండ పవన్, మధు, అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment