మత్తి భాస్కరరావుకు జనసేన నాయకుల అభినందనలు

రేపల్లె: రేపల్లె మార్కెట్ యార్డు కమిటీ చైర్మన్‌గా నియమితులైన శ్రీమతి మత్తి అనురాధ భాస్కరరావు గారికి జనసేన పార్టీ నాయకులు ఘనంగా అభినందనలు తెలిపారు. ఆదివారం సాయంత్రం గుంటూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి ఉప్పు వెంకటరత్తయ్య, గుంటూరు 18వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ, గుంటూరు పట్టణ కార్యదర్శి కలగంటి త్రిపురా కుమార్ లు శుభాకాంక్షలు తెలుపుతూ మర్యాద పూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా ఉప్పు వెంకటరత్తయ్య మాట్లాడుతూ.. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి జెండా పట్టుకుని నియోజకవర్గం మొత్తం పర్యటిస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మత్తి భాస్కరరావు గారి పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శిగా, రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్తగా ఆయన నిర్వహించిన బాధ్యతలు, కార్యకర్తలతో కలిసిన పని తీరు పార్టీలో ప్రేరణాత్మకమని కొనియాడారు. కార్పొరేటర్ నిమ్మల వెంకటరమణ మాట్లాడుతూ, గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ విజయంలో మత్తి అనురాధ భాస్కరరావు గారి విశేష పాత్ర ఉందని, రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో కలిసి గ్రామాల్లో ప్రచారం చేసి ప్రజల సమస్యల పరిష్కారానికి పాటుపడుతున్న వ్యక్తి అని తెలిపారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సంఘం మాజీ అధ్యక్షుడు దళవాయి సుబ్రహ్మణ్యం, యువజన నాయకుడు యర్రగోపుల జయదీప్, పెద్ది మురళి, గాదె శివ, బుల్లెబ్బాయి, సాయి, గాదె లక్ష్మణ్ రావు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment