అల్లపర్రు గ్రామదేవత తిరునాళ్లలో జనసేన నాయకులు

రేపల్లె నియోజకవర్గం, నగరం మండలం, అల్లపర్రు గ్రామదేవత అలపర్తిమ్మ తల్లి తిరునాళ్ల సందర్భంగా మండల నాయకులు గోపరాజు ఉదయకృష్ణ మరియు గ్రామ జనసైనికుల ఆహ్వానం మేరకు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి వడ్రాణం మార్కండేయులు, జిల్లా కార్యదర్శి మత్తి భాస్కర్, జిల్లా సంయుక్త కార్యదర్శి చందోలు ప్రసాద్, దేశంశెట్టి సూర్య, పొన్నూరు మండల అధ్యక్షుడు నాగిశెట్టి సుబ్బారావు, చేబ్రోలు మండలం ఉపాధ్యక్షులు
నారిశెట్టి కృష్ణ పాల్గొని గ్రామదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం తిరునాళ్ళు సందర్భంగా గ్రామ జనసైనికులు మరియు వీరమహిళలు ఏర్పాటు చేసినటువంటి మజ్జిగ మరియు పలహారం స్టాల్ ప్రారంభించి భక్తులకి పంపిణీ చేశారు.