ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఆదివారం మదురై విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. హిందూ మున్నానీ సంస్థ ఆధ్వర్యంలో మదురైలో జరుగుతున్న మురుగన్ భక్తుల మహానాడు కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన తమిళనాడుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా తిరుపతి నుండి వచ్చిన జనసేన నేతలు ఆరణి మదన్ మోహన్, రాజా రెడ్డి, సుభాషిని, బాబ్జి, అనిల్ తదితరులు పవన్ కళ్యాణ్‌కు ఘన స్వాగతం పలికారు. వీరమహిళలు, జనసైనికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Share this content:
Post Comment