Anantapur: జనసేన నేతల అరెస్ట్

అనంతపురం SSBN ఎయిడెడ్ కళాశాలను ప్రైవేట్ పరం కాకుండా చూడాలని జనసేన పార్టీ అనంతపురంజిల్లా అధ్యక్షులు శ్రీ ట్ఛ్.వరుణ్ ఆదేశాల మేరకు కలెక్టర్ గారికి శాంతియుతంగా వినతిపత్రం ఇవ్వడానికి పోతున్న రాష్ట్ర కార్యక్రమాల కార్యనిర్వాహణ ప్రధాన కార్యదర్శి భవానీరవికుమార్, జిల్లా ఉపాధ్యక్షులు జయరామిరెడ్డి, అంకె ఈశ్వరయ్య, జిల్లా కార్యదర్శి జయలక్ష్మి, సిద్దు, నాయకులు పొదిలిబాబురావు, హుస్సేన్, శ్రీనివాస్, అంజి, చరణ్, ధరాజ్ భాష, వెంకటేష్ లను అడ్డుకొని అరెస్ట్ చేసి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ కి తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.