పేద మహిళలకు జనసేన నాయకులు సాయం అభినందనీయం

పశ్చిమగోదావరి జిల్లా, ఆకివీడు మండలం దుంపగడప గ్రామానికి చెందిన బొడ్డు కనకదుర్గ హార్ట్ ప్రాబ్లంతో భీమవరంలోని తేజ హాస్పిటల్ లో జాయిన్ అయింది. ఎవరూ లేకపోవడం వల్ల వైద్యం చేయించుకునే స్తోమత లేదు. ఆ విషయాన్ని తేజ హాస్పిటల్ యాజమాన్యం ఒడుగు ప్రభాస్ రాజు కి తెలియజేశారు. రాజు వెంటనే స్పందించి, కృత్తివెన్ను మండల జనసేన పార్టీ నాయకుల సహాయంతో ఆమెకు వైద్యం చేయించడం జరిగింది. గురువారం, ఆమె చాలా ఆరోగ్య ఇంటికి వెళ్లడం జరిగింది. జనసేన నాయకులతో పాటు తేజ హాస్పిటల్ చంద్రశేఖర శర్మ కూడా ఆర్థిక సాయం చేశారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ తో పాటు, ఇంటిదగ్గర ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి అని పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయడమైనది. కనకదుర్గకు ఆర్థిక సహాయం అందించిన వారు, ఒడుగు ప్రభాస్ రాజు జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగ రాష్ట్ర కార్యదర్శి, తిరుమని రామాంజనేయ జనసేన పార్టీ కృత్తివెన్ను మండల అధ్యక్షుడు, కూనసాని నాగబాబు జిల్లా కార్యదర్శి, తిరుమలశెట్టి చంద్రమౌళి జిల్లా ప్రధాన కార్యదర్శి, పాశం నాగమల్లేశ్వరరావు, కొప్పినేటి నరేష్, మల్లాడి రాజకుమార్, పూజన్య మరియు జనసైనికులు ఉన్నారు. సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు.