కేశవాయన గుంటలో ప్రవహిస్తున్న వరద వీధుల్లో జనసేన నేతలు

తిరుపతి, సాయి నగర్ పంచాయితీ పరిధిలోని కేశవాయనగుంట ప్రధాన మార్గాలలో, మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంతో రోడ్లపైనే చెత్త పేరుకుపోయి ఉందని దీనివలన కాలువలో మురుగు నీరు సైతం వరద ప్రవాహంతో కలిసి, రోడ్లపై ప్రవహించడం పట్ల జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక వైసీపీ నేతలు తాము వరద ముంపు ప్రాంతాలలో పర్యటించి వరద నీరు నిలవడానికి కారణమైన వ్యర్థాలను ప్లాస్టిక్ కవర్ల వ్యర్ధాలను తొలగించామని.. గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ కొన్ని ప్రాంతాలతో సహా కేశవాయనగుంట పరిస్థితి ఏమని కార్పొరేషన్ ప్రజా ప్రతినిధుల్ని, స్థానిక వైసీపీ ఎమ్మెల్యేని ప్రశ్నించారు. మాటలు చెప్పడం కాదు ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కాదు. కార్పొరేషన్ సిబ్బంది చేత డ్యూటీలు కరెక్ట్ గా చేయిస్తే ఈ సమస్య ఉండదని హితవు పలికారు. ఈ మురుగు వ్యర్ధాల వల్ల పరిసర ప్రాంతాల్లో ఉండడం వలన ప్రజలు అనారోగ్యం పాలవుతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో జనసేన రాష్ట్ర నేతలు నాదెండ్ల మనోహర్, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, కిరణ్ రాయల్ తో పాటు జనసైనికులు నాయకులు పాల్గొన్నారు.