ఎంఎస్ఎమ్ఈ పార్క్ ను పరిశీలించిన జనసేన నాయకులు

ఆత్మకూరు, ఆత్మకూరు ఎంఎస్ఎంఈ పార్కులో మంజూరైన సెంచరీ ప్లైవుడ్ కర్మాగారం కడప జిల్లా బద్వేల్ కు తరలి వెళ్ళి పోవడం దారుణం అంటూ నిరసన ర్యాలీ చేపట్టిన ఆత్మకూరు జనసేన నాయకులు నారం పేట వద్ద పనులు ఆగిపోయినా ఎం ఎస్ ఎం ఈ పార్కును పరిశీలించిన జనసేన ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్, జనసేన నాయకులు. నారంపేట వద్ద ఏర్పాటుచేసిన ఎంఎస్ఎమ్ఈ పార్క్ కడప జిల్లా గోపవరంకు తరలి పోయిందంటూ ఆత్మకూరు పట్టణంలో నిబిఎస్ఆర్ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టిన జనసేన నాయకులు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్ భరత్, అనిల్ రాయల్, నాగరాజు యాదవ్, శ్రీరామ్ పసుపులేటి, భాను దాడి, అనంత సాగరం నాయకులు రవి, ఉదయగిరి సంఘం నాయకులు రాకేష్ యాదవ్ ఆత్మకూరు నాయకులు ప్రవీణ్ ప్రత్తిపాటి, ఆత్మకూర్ టౌన్ నాయకులు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు.