తహసిల్దార్, ఎంపీడీవోను కలిసిన జనసేన నాయకులు

పామిడి, పామిడి మండలానికి నూతనంగా నియమితులైన తహసిల్దార్ శ్రీమతి షర్మిలని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు ధనుంజయ నాయకత్వంలో పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ, ప్రజల సమస్యలు పరిష్కారంలో సహకారం అందించేందుకు జనసేన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని తెలియజేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ షర్మిల మాట్లాడుతూ, ప్రజా సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించేందుకు తాను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా కార్యాచరణ కొనసాగుతుందని పేర్కొన్నారు. తదుపరి పామిడి ఎంపీడీవో శ్రీమతి తేజుష్ణనిని కలిసిన జనసేన నాయకులు, మండలంలోని వివిధ సమస్యలను వివరించారు. ఎంపీడీవో సానుకూలంగా స్పందిస్తూ, త్వరితగతిన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, వేణుగోపాల్, సూర్యనారాయణ, ఓబులేసు, రామాంజనేయులు, ప్రతాప్, లక్ష్మన్న, చలపతి, అఫ్జల్, జగదీష్, నవీన్, సూరి, చంద్రబాబు, పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment