*భూ కబ్జాలపై ఫిర్యాదు
పార్వతీపురం మండలానికి కొత్తగా బాధ్యతలు స్వీకరించిన తహసీల్దార్‌ను జనసేన పార్టీ నాయకులు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మండలంలోని సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన చెరువుల కబ్జాలు, భూకబ్జాల విషయాలను వివరించారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం జనసేన మండల అధ్యక్షురాలు ఆగూరు మణి, బోనెల గోవిందమ్మ, సీనియర్ నాయకులు ఖాతా విశ్వేశ్వరరావు, చిట్లి గణేశ్వరరావు, గుండ్రెడ్డి గౌరీ శంకర్, ఆగూరు శ్రీను, కర్రి మణికంఠ, పైల రాజు, పి.ఎస్.ఆర్. తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తహసీల్దార్ ని కలిసి ప్రజా సమస్యలపై న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Share this content:
Post Comment