కొవ్వూరులో జనసేన నాయకుల సమావేశం..!

కొవ్వూరు నియోజకవర్గం, కొవ్వూరులో మార్చి 14న పిఠాపురంలో జరగబోయే ఆవిర్భావ విజయోత్సవ సభకు సంబంధించిన కార్యక్రమంలో శనివారం కొవ్వూరు ఇంచార్జీ టివి రామారావు, గాయత్రి వేంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పార్లమెంటు జనసేన ఇంచార్జీ మరియు పిఠాపురం సభ ప్రోగ్రాం కమిటీ సభ్యులు అయిన వై శ్రీనివాస్ కొవ్వూరు టోల్ గేట్ దగ్గర ఉన్న టివి రామారావు పంక్షన్ హాలులో నియోజకవర్గ జనసేన ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మహిళాదినోత్సవం సందర్భంగా వీరమహిళలను సన్మానించడం జరిగింది. అలాగే, తాడిపూడిలో ప్రమాదవశాత్తు మరణించిన 5 మందికి సంతాపం ప్రకటించి, వారి కుటుంబసభ్యులకు 1,50,000 రూపాయల సహాయం జనసైనికులు అందించాలని తెలియజేయబడింది. ఈ కార్యక్రమంలో కొప్పాక విజయ్ కుమార్, డేగల రాము, సుంకర సత్తిబాబు, అచ్యుత రాయుడు, తేజ, ప్రబాత్, పెరుగు శివ, స్వామి, నాగరాజు, బాలకృష్ణ, రమేష్, శేఖర్, పోలిశెట్టి శివ, రాంబాబు, సురేష్, హరిబాబు, ఉత్తమ రైతు సత్యనారాయణ, వీర మహిళలు తదితర జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. “ఛలో పిఠాపురం” అనే పోస్టర్ విడుదల చేసి, పిఠాపురం సభను విజయవంతం చేయాలని వై శ్రీనివాస్ జనసేన నాయకులు, జనసైనికులకు దిశానిర్దేశం చేశారు.

Share this content:

Post Comment