పొంగూరు నారాయణని మర్యాద పూర్వకంగా కలిసిన జనసేన నాయకులు

నెల్లూరు: మాజీ మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ సిటీ ఇంచార్జ్ పొంగూరు నారాయణని మర్యాద పూర్వకంగా జనసేన పార్టీ గునుకుల ప్రధాన కార్యదర్శి గురుకుల కిషోర్ తో కలిసిన కాపు సంక్షేమ శాఖ జిల్లా అధ్యక్షుడు బెల్లపు సుధా మాదవ్ మరియు కమిటీ సభ్యులు. కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామ జోగయ్య సూచనలతో మిగిలిన కులాలని కలుపుకొని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఎవరు అభ్యర్థులుగా ప్రకటించినా వారిని గెలిపించుకునే విదంగా పనిచేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో కాపు సంక్షేమ శాఖ జిల్లా స్థాయి సమావేశమునకు హాజరు కావలసిందిగా.. త్వరలో వారి డేట్ ను సమీకరించి తేదీ ప్రకటిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్ తో కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షులు సుధామాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొణిదల సందీప్, కే.ఎస్.ఎస్ నాయకులు సాయి, కోవూరు కే ఎస్ ఎస్ ప్రెసిడెంట్ భక్తవత్సలం, సర్వేపల్లి కే ఎస్ ఎస్ ప్రెసిడెంట్ శరత్, నూతన కే.ఎస్.ఎస్ కావలి కార్యవర్గం, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.