మాజీ జేడి లక్ష్మీనారాయణను కలిసిన జనసేన నాయకులు మోటూరి దంపతులు

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు “ఎస్ “కన్వెన్షన్ హాలులో నరసాపురం మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య మనుమరాలు వివాహ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు మాజీ జేడీ లక్ష్మి నారాయణ హాజరయ్యారు. కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ చిందాడగరువు జనసేన పార్టీ ఎంపిటిసి-మోటూరి కనకదుర్గ, పవన్ కళ్యాణ్ సేవా ట్రస్ట్ అధ్యక్షులు – మోటూరి వెంకటేశ్వరావు లను పవన్ కళ్యాణ్ సేవా ట్రస్ట్ ద్వారా మీరు చేస్తున్న కార్యక్రమాలు నేను ఫేస్ బుక్, ట్విట్టర్ ద్వారా చూస్తున్నాను. ఎంతో మందికి మీరు ఆకలి తీరుస్తున్న ఆదర్శ దంపతులని కొనియాడారు. అలాగే ముందు ముందు మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆ దంపతులిద్దరిని ఆశీర్వదించారు.