ప్రమాదవశాత్తు మరణించిన జనసైనికునికి అండగా జనసేన నాయకులు

తూర్పుగోదావరి జిల్లా, రంపచోడవరం నియోజకవర్గం, అడ్డతీగల మండలం, డొక్కపాలెం గ్రామంలో ఇటీవల మద్ది గడ్డ రిజర్వాయర్ లో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు జర్త బాలరెడ్డి అనే యువకుడు మృతిచెందాడు. వారి కుటుంబాన్ని జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి సుంకర, అడ్డతీగల మండలం జనసేన పార్టీ నాయకులు, వైరామవరం మండలం జనసేన నాయకులు డొక్క పాలెం గ్రామంలో తల్లి జర్త లక్ష్మి కుటుంబాన్ని పరామర్శించి దైర్యం చెప్పటం జరిగింది. జర్త లక్ష్మి భర్త ఇదివరకే మరణించారు, కళ్లు కూడా కనిపించని వృద్దప్యంలో ఉన్న తండ్రిని కూడా ఆమె సాకుతు కష్టాలు పడుతున్నారు. సుంకర కృష్ణవేణి చేతుల మీదగా జనసైనికులు 50 కేజీల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఉపాధ్యక్షురాలు కృష్ణవేణి మాట్లాడుతూ ఆపదలో ఉన్న వాళ్లకి ఎప్పుడు జనసేన పార్టీ అండగా ఉంటుంది.ప్రభుత్వం వెంటనే స్పందించి గిరిపుత్రులైన వారి కుటుంబాన్ని ఆదుకోవాలని తక్షణమే ఎక్ష్గ్రేసియా ప్రకటించాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. అడ్డతీగల మండలంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎవరు ఎటువంటి ఇబ్బంది పడిన పార్టీ అండగా ఉంటుందని, జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలని ప్రతి ఒక్కరికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడ్డతీగల మండలంజనసేన యువనాయకులు కుప్పాల జయరామ్, చోళ్ళ కృష్ణారెడ్డి, కర్ర నరసయ్య, వీరేంద్ర, అచ్చమ్మ నాగమణి, వైరామవరం మండలం పల్లాల కృష్ణారెడ్డి, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.