నెల్లూరు సిటీలో మన్సూర్ నగర్‌లోని రెహమతయ్య మసీదు వద్ద జనసేన నాయకులు గునుకుల కిషోర్ మరియు ముస్లిం నాయకులు షేక్ యాసిన్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్ విందు నిర్వహించగా, జనసేన మరియు తెలుగుదేశం కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వానికి ముస్లిం సోదరుల మద్దతు ముఖ్యమని, అభివృద్ధి పట్ల వారి ఆసక్తిని ప్రశంసించారు. భారతదేశం భిన్న మతాలు, సాంస్కృతిక సంప్రదాయాల సమ్మేళనమని, పవన్ కళ్యాణ్ సూచించిన విధంగా “ఎవరి మతాన్ని వాళ్లు కాపాడుకోవడం బాధ్యత” అని తెలిపారు. నెల్లూరులో హిందువులు, ముస్లింలు సోదర భావంతో పండుగలు కుటుంబ వేడుకలలా జరుపుకుంటున్న స్నేహపూరిత వాతావరణాన్ని కొనియాడారు. రంజాన్ మాసంలో ఉపవాసం చేస్తున్న ముస్లిం సోదరుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం సుభిక్షమైన పరిపాలన అందించాలని ఆకాంక్షిస్తూ, ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన షేక్ యాసిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 42వ డివిజన్ నాయకులు షేక్ యాసిన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు జకీర్, ఇంతియాజ్, సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, రాజేష్, శరవణ, నరహరి, సత్యం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment