కూకట్‌పల్లి నియోజకవర్గం, ప్రభాకర్ రెడ్డి నగర్ శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ చైర్మన్ సాగర్ మరియు కమిటీ సభ్యులు ఆహ్వానం మేరకు కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని శ్రీ ఆంజనేయ, శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ దత్తాత్రేయ, శ్రీ రామలింగేశ్వర, శ్రీ ఆదిత్య నవగ్రహ మరియు ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి జనసేన పార్టీ నాయకులు బోగాది వెంకటేశ్వరరావు, కొల్లా శంకర్, అడబాల షణ్ముఖ, బలిజేపల్లి శంకర్రావు, బిజెపి నాయకులు బూరుగుపల్లె రామ్మోహన్, సతీష్ గౌడ్, కాలనీ జనరల్ సెక్రెటరీ దత్తు, వెంకటేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment