శ్రీ సీతారామచంద్రమూర్తి విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్న జనసేన నాయకులు

జి.మాడుగుల మండలం, కె.కోడపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్రమూర్తి ఆలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్టకు అశేష సంఖ్యలో జనసైనికులు, ప్రజలు హిందు ధార్మిక కార్యక్రమములో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా విచ్చేసిన జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ వంపురు గంగులయ్య శాస్త్ర విజ్ఞులచేత వేదమంత్రోచ్ఛారణతో శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ఠ చేశారు. డాక్టర్ గంగులయ్య మాట్లాడుతూ సనాతన హిందు ధర్మ పరిరక్షణ, హిందు ధర్మం ఒక జీవనవిధానం. కేవలం ఒక మతం కాదని ఆ పురాణ పురుషుడి నడయాడిన ఈ నేల ఎంతో పుణితమైనది. సనాతన భారతవని అందించిన వేద కాలపు విజ్ఞానాన్ని ఈ తరం యువత ఆ విలువలను పెంపొందించుకోవాలని యువతని ఉద్దేశించి మాట్లాడరు. అశేష బక్తజనంతో పాటు కలిసి సహా పంక్తి భోజనాలు చేశారు. భజన బృందాలుగా వచ్చిన గెమ్మెలి కొత్తూరు, చింతలవీధి, కులపాడు గ్రామాల రామ భజన బృందాలను అభినందించారు. ఈ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో జనసేన పార్టీ నుండి పాడేరు మండల జనసేన పార్టీ అధ్యక్షుడు నందోలి మురళీ కృష్ణ, ఉప అధ్యక్షుడు సాలేబు అశోక్, అరకు పార్లమెంట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ కొర్ర కమల్ హసన్, జనసైనికులు ప్రసాద్, శ్రీను, సంతోష్, శ్రీనివాస్, అశోక్ కుమార్, కొండబాబు, గణేష్, జి.మాడుగుల, పాడేరు, మండలాల జనసైనికులు వీరమహిళలు, చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.