పవన్ కళ్యాణ్ రోడ్ షో రూట్ మ్యాప్ మరియు సభా స్థలాన్ని పరిశీలించిన జనసేన నాయకులు

ఏలూరు, ప్రజల్ని నిలువు దోపిడి చేస్తున్నది ఈ వైసిపి ప్రభుత్వం అని జగన్ రెడ్డి జైలుకు తప్పించి ప్రజల మధ్యన తిరగడానికి పనికిరాడని విమర్శించిన రెడ్డి అప్పలనాయుడు. ఈ సందర్భంగా ఏలూరు పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతు ఆంధ్రప్రదేశ్లో ఒక తుగ్లక్ పాలన కొనసాగుతుందని అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయన్నారు. ఈరోజు సాధారణ పౌరులు గాని, మానవులు గాని జీవించేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. ఎందుకంటే వ్యక్తులపైన వ్యవస్థలపైన తెలియకుండా అనేక రూపాలలో ప్రజలపై బాదుడు మోపి ప్రజల నడ్డి విరగ్గొట్టే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మూర్ఖుడైన ముఖ్యమంత్రి పరిపాలనలో మనకు కనిపిస్తుంది. దానికి నిదర్శనమే ఈరోజు వస్తున్న కరెంటు చార్జీలు. 2021, 22 సంవత్సరంలో హౌసులకు గాని షాపులకు గాని కొన్ని కోట్లల్లో రూపాయలు వసూలు చేశారు. ఇవాళ చూస్తే చెరువుల మీద వాడకం లేకపోయినా జీరో యూనిట్లు వచ్చినప్పుడు కూడా 9000, 10000 కరెంట్ బిల్లు వాడకం అన్నట్టు చూపిస్తుంది ఈ పనికిమాలిన దొంగ ప్రభుత్వం. వాహన చోదకులకు వాహన మిత్ర ఇచ్చి అధిక చార్జీలు వేసి ఆటోలు మీద వాళ్లని వేధించే పరిస్థితి అధికమైంది. చార్జీలు ఫైన్లు అందనంతగా వేసి వేధిస్తున్నారు. ఎవరైనా టూ వీలర్ మీద కుటుంబంతో ప్రయాణం చేయాలంటే నరకయాతన పడుతున్నారు. ఎటు నుంచి ఏ పోలీసులు వస్తారో అని అన్ని ఉన్నప్పటికీ ఫైన్లు వేస్తున్నారని వారు వాపోతున్నారు. టూ వీలర్ ఫోర్ వీలర్ మీద చార్జీలు అధికంగా మోపుతున్నారు. పోలీసులు వాళ్ళ జీతాలకు మా మీద చార్జీలు వేసి అడ్డగోలుగా ఫైన్ వేసి ప్రభుత్వాన్ని మైంటైన్ చేసే ప్రక్రియ చూస్తున్నాం. ఈరోజు చూస్తే సాయంత్రం 6 గంటలకు ఏదైతే సమస్యలు ఉంటాయో ఎవ్వరికి తెలియకుండా దానిమీద రూపాయి చార్జీలు ఫోర్ వీలర్ మీద లీటర్ చొప్పున ఒక రూపాయి రోడ్డు మరమ్మతు చార్జీలు అని చెప్పి వసూలు చేసుకుంటుంది ఈ వైసీపీ ప్రభుత్వం. ఏ విషయంలో కూడా రాష్ట్ర ప్రజలు సురక్షితంగా లేరు. ప్రజలు ఎప్పుడు దేహి అన్నట్టుగా ఉండాలన్న పాలన మీద జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క అన్యాయాలు పెరిగిపోయాయి. వాళ్లకు ఉన్న ఈ 60 రోజుల్లో ప్రతి పేదవాళ్ళను ఆదుకోవాలి. ఒకవైపు సబ్సిడీలు వ్యవసాయ రంగాలు. ఎరువులు సకాలంలో అందించలేని పరిస్థితి తలెత్తింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగా కూడా ఈ రాష్ట్రం అన్ని వ్యాపార సంస్థలు మూతలు పడేటట్టు ఉంది.. ఈ రోజున ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎస్.పి.వి.సి అనే పేరుతో 7000 రూపాయలు అడ్డంగా తీసుకుంటున్నారు. ఇది ప్రక్రియ ప్రతి చోట జరుగుతుందని, భయంకరమైన దోపిడీ వ్యవస్థను ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మెంట్ అనుసరిస్తుంది. ఎందుకంటే ప్రజలకు తెలియకుండా అనేక రూపాయలు ఫినాల్టిగా వేసేసి, కరెంట్ బిల్లు కట్టకపోతే మేము ఫీజు పీకేస్తామని బెదిరించి వసూలు చేస్తున్నారు. ఈరోజు సామాన్యమైన ప్రజలకి ఉపాధి కల్పించలేని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక నిత్యవసర రూపాలలోనూ ప్రజలను హింసించి మోసం చేసినటువంటి దిక్కుమాలిన ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం. చరిత్రలో ఇలాంటి సీఎం మరెక్కడా లేదని జనాలు ఈయన్ని ఇంటికి పంపించడానికి సిధ్ధంగా ఉన్నారని తెలియజేశారు.

త్వరలోనే ఏలూరులో పవన్ కళ్యాణ్ గారి రోడ్డు షో అనంతరం బహిరంగ సభ:

త్వరలో ఏలూరులో జరగబోయే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రోడ్ షో మరియు భారీ బహిరంగ సభకు సంబంధించి రూట్ మ్యాప్ మరియు సభా స్థలాన్ని గోదావరి జిల్లాల ఎలక్షన్ ప్రోగ్రామ్స్ కన్వీనర్ బి.వి రాఘవయ్య చౌదరి తో కలిసి పరిశీలించిన ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయుడు మరియు జనసేన నాయకులు నారా శేషు. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 14వ తేదీ నుండి భీమవరం నర్సాపురంలో పర్యటించనున్నారు. ఈనెల 17వ తేదీ వరకు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తారు. జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థులుగా జనసేన పార్టీ తరపున పోటీ చేసే నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరఫున త్వరలో ప్రచారం చేయబోతున్నారు. దానిలో భాగంగానే త్వరలోనే ఏలూరులో పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. మాకు వచ్చిన సమాచారం ప్రకారం రోడ్డు షోలో భాగంగా పవన్ కళ్యాణ్ కైకలూరు మీదుగా గడియార స్తంభం, పాత బస్టాండ్ నుండి ఫైర్ స్టేషన్ సెంటర్, అశోక్ నగర్ పత్తేబాద మీదుగా డీమార్ట్ 12 పంపులు సెంటర్ కి చేరుకుంటారు. 12 పంపుల సెంటర్లో బహిరంగ సభ ఉంటుందని పార్టీ అధిష్టానానికి సూచించడం జరిగిందని తెలిపారు. అధిష్టానం షెడ్యూల్ వివరాలు త్వరలోనే ప్రకటిస్తానన్నారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా సంయుక్త కార్యదర్శి ఓబిలిశెట్టి శ్రావణ్ కుమార్ గుప్తా, నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, కార్యదర్శులు కందుకూరి ఈశ్వరరావు, ఎట్రించి ధర్మేంద్ర, బొత్స మధు, కోశాధికారి పైడి లక్ష్మణరావు, మీడియా ఇంచార్జీ జనసేన రవి, నాయకులు బోండా రాము నాయుడు, వీరంకి పండు, రెడ్డి గౌరీ శంకర్, నూకల సాయి తదితరులు పాల్గొన్నారు.