*నగర జనసేన పార్టీ కార్యదర్శి కొత్తకోటి ప్రసాద్
గుంటూరు నగరంలోని 32వ డివిజన్ బ్రాడిపేటలో పలు కాలనీల్లో నెలకొన్న వర్షపు నీరు, మురికినీటి కలుషిత సమస్యలపై జనసేన పార్టీ నగర కార్యదర్శి కొత్తకోటి ప్రసాద్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు స్పందించారు. బ్రాడిపేట 1/13, 2/13, 2/3, 3/4, 4/3 ప్రాంతాలు పల్లంగా ఉండటంతో చిన్నపాటి వర్షానికే నీరు నిలిచిపోతూ కాలువల మురికినీటితో కలిసి తీవ్ర కాలుష్యాన్ని కలిగిస్తూ, స్థానికులను అనారోగ్యానికి గురిచేస్తోందని పేర్కొన్నారు. గత మూడు నెలలుగా శానిటరీ సిబ్బంది తక్కువగా ఉండటంతో చెత్త శుభ్రపరచడం ఆలస్యం అవుతుండటంతో పాటు వీధిలైట్ల లోపాలు కూడా స్థానికులకు మరింత ఇబ్బందిగా మారాయి. ఈ నేపథ్యంలో సమస్యలన్నింటిని వినతి పత్రం రూపంలో గౌరవ గుంటూరు పశ్చిమ శాసనసభ్యురాలు శ్రీమతి గల్లా మాధవికి సమర్పించారు. గత మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ అంశాలపై చర్చ జరిగిందని గుర్తుచేస్తూ, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నగర జనసేన ఉపాధ్యక్షుడు కొండూరు కిషోర్, కార్యదర్శి ఫణీంద్ర శర్మ, డివిజన్ కమిటీ సభ్యుడు శరత్, స్థానికులు సకల నాగార్జున, పొలిశెట్టి రాంబాబు, నోరి పార్థ సారథి తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment