గుండె జబ్బతో బాధపడుతున్న యువకునికి అండగా నిలచిన జనసేన నాయకులు

సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, కసుమూరి పంచాయితి కొండకిందపల్లి హరిజనవాడలో అజయ్ అనే 23సంవత్సరాల యువకుడు గతకొద్దికాలంగా గుండె జబ్బతో బాధపడుతూ, జీవనాధారంలేక ఇబ్బంది పడుతున్నాడు. విషయం తెలుసుకొన్న జనసేన రీజినల్ కో ఆర్డినేటర్ కోలా విజయలక్ష్మి ఆధ్వర్యంలో కాపు సంక్షేమ జిల్లా అధ్యక్షులు లక్ష్మీ మల్లేశ్వరావు, గౌరీ సునీత సహకారంతో కిరాణాషాపు పెట్టించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలకమిటి సభ్యులు వెంకటేష్ చలపతి పాల్గొన్నారు.