జిహెచ్ఎంసి అసిస్టెంట్ కమిషనర్ కు వినతిపత్రమిచ్చిన జనసేన నాయకులు

కూకట్‌పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గురువారం జిహెచ్ఎంసి ఆఫీస్ లో ఓటర్ల నమోదు, ఓటర్ల తొలగింపు మరియు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని కోరుతూ (ఈ ఆర్ ఓ) బి.వంశీకృష్ణ అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఆ సమావేశమునకు జనసేన పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గ నాయకులకు సమాచారము ఇవ్వలేదు. జనసేన పార్టీ కూడ ఎన్నికల సంఘంతో గుర్తింపు బడ్డ పార్టీ తమ గుర్తు గాజు గ్లాస్ గుర్తు అని తెలియజేయబడినది. ఇకపై అన్ని రాజకీయ పార్టీలతో పాటు తమకు కూడా సమాచారం ఇవ్వవలసిందిగా జోనల్ కమిషనర్ మరియు ఈ.ఆర్.ఓ ని కోరుతూ జిహెచ్ఎంసి అసిస్టెంట్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కూకట్‌పల్లి నియోజకవర్గ కోఆర్డినేటర్లు కొల్లా శంకర్, భోగాది వెంకటేశ్వరరావు, వేముల మహేష్, కలిగినీడి ప్రసాద్, పులగం సుబ్బు తదితరులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment