అంగన్వాడి వర్కర్స్ యూనియన్ ఆందోళనకు జనసేన నేతల మద్దతు

నెల్లూరు: నగరంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 36 గంటలు నిరవధిక ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్న అంగన్ వాడీ కార్యకర్తలు ఆయాల ఆందోళనకు జనసేన జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్, నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు తదితరులు సంపూర్ణ మద్దతు తెలిపారు. అంగన్వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం జనసేన తరఫున తమ వంతుగా పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీల సమస్యలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకు వెళ్తామని తమ ప్రభుత్వం రాగానే అంగన్వాడీలకు తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.