అగ్నిప్రమాద బాదితులకు అండగా నిలచిన జనసేన నాయకులు

రాజోలు: కేశవదాసుపాలెం గ్రామం కూనపాలెంలో 5 రోజులు క్రితం రాత్రి సమయంలో పెరబత్తుల సుబ్బలక్ష్మి, సత్తిబాబు ఇళ్ళు గ్యాస్ పొయ్యి ద్వారా ఎక్కువ మంట రావడంతో ఇల్లు ఆహుతి అయి ప్రాణాలు చేత పట్టుకుని కట్టు బట్టలతో బయట పడ్డారు.. మొత్తం సామానులు, అతను పనిచేసే ఓనర్ షాప్ లో కట్టమని ఇచ్చిన డబ్బులు 70,000 రూపాయలు, బీరువాలో 20,000, అన్ని మంటల్లో కాలిపోయాయి. వారికి ఇద్దరు చిన్న పిల్లలు.. ప్రస్తుతం పక్కన ఇంట్లో ఉంటున్నారు. ఈ క్రమంలో బాధిత కుటుంబానికి జే. డి. ఫౌండేషన్ టీం మరియు ఆంధ్ర, తెలంగాణా, రాధా రంగా మిత్రమాండలి చారిటబుల్ ట్రస్ట్, మరియు జనసేన టీం మరియు, ఫేస్బుక్ మిత్రులు, అందరి సహకారంతో వారికి మా వంతుగా నిత్యవసర సరుకులు, వస్తువులు, వంట సామాగ్రి, దుస్తులు, దుప్పట్లు, సహాయం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేగి వాణిశ్రీ స్నేహతురాలతో పాటు బోనం దుర్గా ప్రసాద్, అన్నంనిడి రాజేష్, రావూరి తేజా, ఉండపల్లి అంజి, మేడిచర్ల ప్రసాద్, గెల్లి శ్రీను, సత్యనారాణ, ఉన్నారు వీరికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక జనసేన తరపున ధన్యవాదములు తెలియజేసారు.