కాళంగి రిజర్వాయరును సందర్శించిన జనసేన నాయకులు

కాళంగి రిజర్వాయర్ మరియు శ్రీకాళహస్తి కాళంగి మధ్యన ఉన్న వంతెన నిర్మాణాన్ని జనసేన నాయకులు సందర్శించడం జరిగింది.

సత్యవేడు నియోజకవర్గం KVB పురం మండలంలోని కాళంగి రిజర్వాయర్ మరియు శ్రీకాళహస్తి కాళంగి మధ్యన ఉన్న వంతెన నిర్మాణాన్ని జిల్లా కార్యదర్శి కొప్పల లావణ్యకుమార్ సందర్శించడం జరిగింది. లావణ్య కుమార్ మాట్లాడుతూ రిజర్వాయరు గేట్లు శిథిలావస్థకు చేరాయని, నీరు వృధాగా పోతున్నాయని, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారని ప్రభుత్వం చొరవతీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. శ్రీకాళహస్తి కాళంగి మార్గంలో బాగా ఉన్న వంతెనని కూల్చివేసి, కొత్తగా టెండర్లు వేసి నెలలు గడుస్తున్నా కనీసం సగం కూడా పూర్తి చేయలేని పరిస్థితి. చుట్టుపక్కల 7 పంచాయతీల ప్రజలు రాకపోకలకు ఇబ్బంది పడుతున్నారు. సకాలంలో వంతెన నిర్మాణం జరగకపోతే గ్రామాల ప్రజలతో ఆందోళనకు దిగుతామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మోహన్, భార్గవ్, మాతయ్య, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.