ఉరవకొండ నియోజకవర్గం, పెన్నాహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం నందు జనసేన నాయకులకు శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు ఆలయ ప్రధాన అర్చకులు ఇవ్వడం జరిగింది. అనంతరం పెన్నోహోబిలం నందు వారం రోజుల్లో జరగబోయే రథోత్సవం బ్రహ్మోత్సవాలు సంబంధించి ఆలయ అధికారులు రమేష్ బాబుతో చర్చించడం జరిగింది. రధోత్సవం సందర్భంగా ప్రజలకు & భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఇబ్బందులు పడకుండా ముఖ్యంగా తాగునీటి ఏర్పాట్లు చేయాలని ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని విన్నవించడం జరిగింది అనంతరం ఆలయ అధికారి రమేష్ బాబు రథోత్సవం కరపత్రాలను జనసేన ఇన్చార్జ్ గౌతమ్ కుమార్ మండల అధ్యక్షులు చంద్రశేఖర్, కేశవ్, సుధీర్, గోపాల్ మరియు జనసేన నాయకులతో ప్రారంభించడం జరిగింది. జనసేన నాయకులు రథోత్సవం పరిశీలించి తగిన ఏర్పాట్లు చేస్తూ ఎలాంటి ఇబ్బందిలు కలగకుండా చూడాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉరవకొండ నియోజవర్గం ఇంచార్జ్ గౌతమ్ కుమార్ తెలిపారు ఆయనతోపాటు ఉరవకొండ కన్వీనర్ చంద్రశేఖర్, వజ్రకరూరు కన్వీనర్ కేశవ్, బెలుకుప్ప సుదీర్, విడపనకల్ కన్వీనర్ గోపాల్, మరియు నాయకులు దేవేంద్ర, రాజేష్, రమేష్, మణి కుమార్, ధనంజయ్, బోగేష్, నీలకంఠ, రఘు, అనిల్, రమణ, అభి తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment