పార్వతీపురం జిల్లా నర్సిపురం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బలిజిపేట మండలం పెదపెంకి గ్రామానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులను జనసేన పార్టీ నాయకులు బుధవారం పరామర్శించారు. ప్రస్తుతం పార్వతీపురం జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరిశీలించి, వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. వైద్యులతో మాట్లాడి అందిస్తున్న చికిత్సపై వివరాలు అడిగి తెలుసుకున్న జనసేన నాయకులు, అవసరమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తుతో వైసీపీ నాయకులు రాజకీయం చేస్తుండడం దురదృష్టకరమన్నారు. రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితులు సృష్టించి, ప్రజల జీవితాలతో రాజకీయం చేయాలనే కుట్రలకు ప్రజలు వ్యతిరేకంగా స్పందిస్తున్నారని తెలిపారు. బాధిత విద్యార్థులకు నాణ్యమైన వైద్యం అందించేందుకు తాము కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు ఆగూరుమణి, నాయకులు బోనెల గోవిందమ్మ, చెట్లు గణేష్, గుంట్రెడ్డి గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment