జనసేన కార్యకర్తను పరామర్శించి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

ఏన్కూరు: ఏన్కూరు మండలం రేపల్లెవాడ గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్ వీరాభిమాని మరియు జనసేన కార్యకర్త పణితి తిరుపతిరావు మాతృమూర్తి పణితి యేసుమణి ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబాన్ని జనసేన నాయకులు మంగళవారం పరామర్శించి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ బొగ్గారపు శివకృష్ణ, కొవ్వూరి మహేష్, దామెర్ల అశోక్ కుమార్, చుంచు భాస్కర్, ఎస్సీ సెల్ కోఆర్డినేటర్ మద్దెల పవన్ కళ్యాణ్, భాగం రవి, బీసీ సెల్ కోఆర్డినేటర్ పడిమల మురళీకృష్ణ, పసుపులేటి కృష్ణ, ఎస్టీ సెల్ కోఆర్డినేటర్ బోజగాని సురేష్, ముక్తి సతీష్, మైనార్టీ సెల్ కోఆర్డినేటర్ షేక్ యాకూబ్ పాషా, సోషల్ మీడియా కోఆర్డినేటర్ పాశం భరత్, బూరుగు రాము, మద్దెల రాకేష్, బానోత్ అనిల్, వినోద్, రాంబాబు, లాజర్, రాయుడు, వినీత్ తదితరులు పాల్గొన్నారు.