శ్రీశ్రీశ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవిని దర్శించిన జనసేన నేతలు

డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం, శ్రీ దేవీ నవరాత్రుల సందర్భంగా అమలాపురం మెయిన్ రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి, శ్రీశ్రీశ్రీ మహాలక్ష్మి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. గర్భాలయం, అంతరాలయం, ముఖమండపములో 2 కోట్ల 10 లక్షల కొత్త కరెన్సీ నోట్లతో అలకరించారు. అమ్మవారిని జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గం ఇంచార్జ్ శెట్టిబత్తుల రాజబాబు, పురపాలక సణ 7వ వార్డ్ కౌన్సిలర్ గండిదేవి హారిక, 9వ వార్డు కౌన్సిలర్ గొలకోటి విజయలక్ష్మి, జనసేన నాయకులు గొలకోటి వాసు దర్శించుకున్నారు.