పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ద్వారకాతిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న జనసేన నాయకులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు బాగుండడం కోసం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ద్వారకాతిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని కోరుకోవడం కోసం జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గ ఇంచార్జి మేకా ఈశ్వరయ్య ఆధ్వర్యంలో మండల అధ్యక్షులు, జనసైనికులు, వీరమహిళలు చింతలపూడి నుంచి ద్వారకా తిరుమల వరకు సుమారు 70 కిలోమీటర్ల వరకు చేపట్టిన పాదయాత్రలో భాగంగా ద్వారకా తిరుమలలో జరిగిన పాదయాత్రలో పాల్గొని అందరితో కలిసి స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ చింతలపూడి నియోజకవర్గ ఇంచార్జి మేకా ఈశ్వరయ్య, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.ఘంటసాల వెంకటలక్ష్మి, జనసేన నాయకులు మరియు జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.