రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను పరామర్శించిన గంగారపు రాందాస్ చౌదరి

మదనపల్లి: అన్నమయ్య జిల్లా మదనపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివలాలలోనికి వెళితే మదనపల్లి మండలం, బార్లపల్లి వద్ద బెంగళూరు నుండి మదనపల్లికి వస్తున్న ప్రైవేట్ బస్సు బోల్తా పడింది. ఈ బస్సులో 60 మంది ప్రయాణికులు ఉన్నారు. మదనపల్లి సమీపంలోని బార్లపల్లి వద్ద బస్సు అదుపుతప్పి బోల్తా పడి ఇనోవా కారును ఢీకొంది. దీంతో ఇనోవా కారులో ఉన్న కొందరికి తీవ్రగాయాలు కాగా, బస్సులో ప్రయాణిస్తున్న కొంతమందికి తీవ్ర గాయాలు కాగా, గాయాలైన క్షతగాత్రులను 108 సిబ్బంది మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రాందాస్ చౌదరి, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్ పరామర్శించారు.