కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు

నిడదవోలు నియోజకవర్గం, తాడిమల్ల గ్రామంలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా చనిపోయిన కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా కౌలు రైతు కుటుంబానికి జనసేన పార్టీ ఎప్పుడు అండగా నిలబడుతుందని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఉలుసు సౌజన్య, తులా చినబాబు, పాల వీరాస్వామి, కాకర్ల నాని, నిడదవోలు మండల అధ్యక్షులు పోలీరెడ్డి వెంకటరత్నం, మూర్తి, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.