శ్రీశ్రీశ్రీ భోగాంజనేయ స్వామి బ్రహ్మోత్సవంలో పాల్గొన్న జనసేన నాయకులు

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం నందలూరు మండలంలో నూకినేన్ని పల్లిలో ఎంతో విభవంగా జరిగే శ్రీశ్రీశ్రీ భోగాంజనేయ స్వామి బ్రహ్మోత్సవం శుకరవారం నుంచి మొదలైన సందర్భంగా శనివారం ఉదయం నందలూరు జనసేన పార్టీ ఆధ్వర్యంలో నూకినేన్ని పల్లి జనసైనికుల చేతుల మీదగా పూజ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. రాబోవు ఎన్నికలలో జనసేన-టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడాలని రాజంపేటలో ఎవరికి టికెట్ ఇచ్చిన పార్టీ నిర్ణయం మేరకు కలిసి పని చేసి జనసేన పార్టీని గెలిపించుకోడానికి మీ సహకారం కావాలి అని ఆ ఊరి పెద్దలతో కూర్చొని చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కొట్టే శ్రీహరి, నందు, వెంకటేష్ శాంభవ్, ప్రసాద్ ఈశ్వర్, బాబ్జీ, కళ్యాణ్, ప్రకాష్, మోహన్, ప్రవీణ్, శివ, మళ్ళి, కుమార్, ఉమ్మడి కడప జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు గురివిగారి వాసు పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు.