శ్రీ శ్రీ శ్రీ కృష్ణదేవరాయుల వారి 555వ జయంతి వేడుకల్లో జనసేన మండల కన్వీనర్ కోడి సునీల్ కుమార్ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు. బలిజ సంఘం ఆహ్వానం మేరకు ఈ వేడుకలో పాల్గొని శ్రీ కృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలలు వేసి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ సాహితీ సమరాంగణ సార్వభౌముడు, అష్ట దిగ్గజ కవులను కొలువులో చేరదీసిన కవీంద్రుడు, దేశ బాషలందు తెలుగు లెస్స అని పలికిన చక్రవర్తి 21 సంవత్సరాల పాటు విజయనగర సామ్రాజ్యాన్ని దిగ్విజయంగా పాలించిన వీరుడని కొనియాడారు. ప్రతిఒక్కరూ శ్రీకృష్ణదేవరాయల సేవలను స్మరించుకుంటూ ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఏ రంగంలో ఉన్నా బలిజలందరూ రాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మధు, రాజేష్, శివ, భూషణం, మల్లి, జాకీర్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment