డబ్బగరువులో పర్యటించిన జనసేన నాయకులు

  • మన ప్రజాప్రతినిధుల భీష్మ ప్రతిజ్ఞ
  • అక్కడ డోలి మోతలు నిత్యకృత్యాలు
  • డబ్బగరువు మన ప్రజాప్రతినిధులకు బరువు
  • మేము పదవి దిగే లోపు మీ గ్రామానికి థార్ రోడ్డు వేసి కార్ తో మీ గ్రామానికి అడుగు పెడతాం: టీడీపీ నేత గిడ్డి ఈశ్వరి ప్రతిజ్ఞ
  • 9నెలల లోపు మీ గ్రామానికి మేము స్వయంగా కార్ తో వస్తాము: కొట్టగుల్లీ భాగ్యలక్ష్మి ప్రస్తుత అధికార శాసన సభ సభ్యురాలు ప్రతిజ్ఞ (ఎమ్మెల్యే) జనసేన పార్టీలో డబ్బగరువు గ్రామంలో బారి చేరికలు

పాడేరు: మండలంలోని సలుగు పంచాయితీ చివారు గ్రామమైన డబ్బగరువు గ్రామస్తుల ఆహ్వానం మేరకు ఆ గ్రామాన్ని జనసేన నాయకులు సందర్శించారు. జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా. గంగులయ్య అదేశాలమేరకు జనసేన పార్టీ నాయకులు గ్రామపర్యటనకు డబ్బగరువు గ్రామానికి చేరుకున్నారు. ఆ గ్రామానికి చేరుకోవాలంటే సలుగు పంచాయితీ లోనే వాహనాలు నిలిపేసి సుమారు 8 కిలోమీటర్ల దూరం దట్టమైన అడవిమార్గం గుండా నిట్టనిలువునా ఉన్న కొండ దిగుతూ అతికష్టం మీద ప్రయాణించాల్సి ఉంటుంది. 8 మంది బృందంతో ఆ గ్రామానికి చేరుకున్న జనసేన పార్టీ నాయకులు అక్కడి పరిస్థితులు పరిశీలించి నిర్ఘాంతపోయారు. ఈ సందర్బంగా గ్రామస్తులు ఏర్పాటు చేసిన సమావేశంలో జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న మాట్లాడుతూ.. ఈ గ్రామానికి చూస్తుంటే బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబందాలు లేవేమోనని అనిపిస్తుంది. కనీస మౌలికసదుపాయాలు కల్పన విషయంలో ప్రభుత్వాలు చేసే నిర్లక్ష్యానికి ప్రధాన సాక్ష్యంగా కనిపిస్తుంది ఈ గ్రామం. దశాబ్దాలుగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నా కూడా పాలకుల మొద్దు నిద్రకి బలైన బలి పశువులా మిగిలింది ఈ గ్రామం. దీనంతటికి మన అమాయకత్వమే కారణం, మన ప్రశ్నించలేని తత్వమే ప్రధాన కారణం ఇంకా ఇప్పటికి ప్రశ్నించకపోతే ఇలాగే ఈ అడవి మధ్యలోనే నెలరాలే అమాయక ఆదివాసీ ప్రజల ప్రాణాలెన్నో అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. లీగల్ అడ్వైజర్ స్పందిస్తూ ఈ గ్రామంలో జర్త శాంతి అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు డోలి మోతలతో ఆస్పత్రికి తరలించారు. సోషల్ మీడియా లో చూస్తే ఆ దృశ్యం మనుసుని కలచివేసింది. రోడ్డు సౌకర్యం కోసం మీరు స్వచ్ఛందంగా చేసుకున్న శ్రమదానం కూడా అడ్డుకున్న ప్రభుత్వాల తీరుపై వ్యతిరేకిస్తున్నాం. ప్రభుత్వాలు మైనింగ్ ప్రాంతాలలో హైవేలు వేస్తారు ఎందుకంటే అక్కడ లాభాలు ఉంటుంది. ప్రజాస్వామ్య విధానానికి లోబడి ఓట్లు వినియోగించుకుంటున్నా మనుషుల క్షేమాన్ని ప్రభుత్వం పట్టించుకోదు? ఇంకెన్ని ప్రాణాలు బలి తీసుకుంటే ఈ ప్రభుత్వాలకు సంతృప్తి? గిరిజన ప్రజాప్రతినిధులేమో ఏసీ కార్లలో.. మన బ్రతుకులేమో డోలిమోతలతో.. ఇదేనా గిరిజనుల అభివృద్ధిపై వాళ్లకున్న శిత్తశుద్ధి? ఇదేనా స్వతంత్ర భారతం?, ఎన్నో ప్రభుత్వాలు చూశాం, ఎందరో పాలకులను చూశాం కానీ ఏం లాభం? ఈ సారి జనసేనపార్టీ ద్వారా మీకు అండగా ఉంటాం. మేము మారుమూల గ్రామ పర్యటన చేస్తుంటే అనేక సమస్యలు చూస్తున్నాం. ఇటువంటి మారుమూల పల్లెల మొర వినే నాదులు కరువయ్యారు. మన గిరిజన సమస్యలపై రాజీలేని పోరాటం చెయ్యాలంటే జనసేనపార్టీ ద్వారా మాత్రమే సాధ్యం, పరిస్కారం కోసం ముందడుగు పడుతుంది. ప్రభుత్వాలకు బలంగా ప్రశ్నించగలం. పవన్ కళ్యాణ్ సారధ్యాన్ని నమ్ముదాం టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలను చూసేసాం. ఇకపై జనసేనపార్టీ ప్రభుత్వ స్థాపనకు మనవంతు తోడ్పాటునిద్దాం మన అభివృద్ధి మనమే చేసుకుందాం. అంటూ పిలుపునిచ్చారు. కార్యనిర్వాహక సభ్యులు రమేష్, సతీష్ మాట్లాడుతూ.. ఇప్పటికి గిరిజన బ్రతుకులపై ఏ ప్రభుత్వాలకైనా చిన్న చూపు ఉందని, కేవలం ఓట్ల కోసం మాత్రమే ఎలక్షన్ సమయంలో వస్తారని అటువంటి నాయకులను నమ్మింత కాలం మనకు ఇటువంటి కష్టాలు తీరవని, ఇప్పటికి శంకుస్థాపన చేసిన మిట్టలపాడు రోడ్డు కూడా అర్దాంతరంగా నిలిపేసారని అన్నారు. గ్రామ ప్రజలు నాయకుల కోసం మాట్లాడుతూ.. గతంలో టీడీపీ నుంచి గిడ్డి ఈశ్వరి మేడం మా గ్రామస్తులతో మేము పదవి దిగే లోపున థార్ రోడ్డువేసి కార్ తో మీ గ్రామనికి అడుగుపెడతామని అన్నారు మమ్మల్ని మభ్యపెట్టారు మా గ్రామానికి ఇచ్చిన మాట తప్పారు అదే మాట వైసీపీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారు మేము మీ గ్రామానికి 9 నెలల లోపు రోడ్డు మంజూరు చేసి మీ గ్రామానికి కార్ తో వస్తామని పంచాయితి పరిధిలో గడప, గడప కార్యక్రమానికి వచ్చి హామీ ఇచ్చారు. తప్పితే మా గ్రామానికి రాలేదు కారణం రహదారి లేదు. ఇప్పుడు తెలిసింది మేము మోసపోయామని కేవలం రహదారి సౌకర్యం లేని కారణంగా 18 మంది నిండు ప్రాణాలు కోల్పోయారని అయిన ఇంకా మోసపోతూనే ఉన్నామని బహుశా మోసపోవడం మా బలహీనత అయిపోయిందని వాపోయారు. ఈ సందర్బంగా జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితులైన డబ్బగరువు గ్రామస్తులు లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ ఆధ్వర్యంలో కండువాలు కప్పుకుని జనసేన పార్టీలో చేరారు. ఈ గ్రామ పర్యటనలో లీగల్ అడ్వైజర్, కిల్లో రాజన్, జి.మాడుగుల మండల అధ్యక్షులు, మసాడి భీమన్న జి.మాడుగుల మండల నాయకులు అంకిత్, కార్యనిర్వహక అధ్యక్షులు తాంగుల రమేష్, పాడేరు మండల నాయకులు సతీష్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.