నీట మునిగిన పంట పొలాలను పరిశీలించిన జనసేన నాయకులు

మాండూస్ తుఫాను ప్రభావంతో కురిసిన అధిక వర్షాలు వల్ల కృత్తివెన్ను మండలంలో పంట నీటి మునిగినది. నీట మునిగిన పంట పొలాలను శనివారం పెడన జనసేన నాయకులు కృత్తివెన్ను మండలంలో పర్యటించి.. నీటి మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మాండూస్ తుఫాను ప్రభావంతో అధిక వర్షాల ప్రభావంతో పంట పొలాలు నీట మునగటం వల్ల రైతుల పూర్తిగా నష్టపోయారు, కురిసిన భారీ వర్షాలకు వరి పొలాలు నేలకొరిగి పంట నష్టం జరిగింది. తమ పొలాలు నీట మునిగి వారం రోజులు అవుతున్న అధికారులు ఎవరూ తమను పట్టించుకోలేదని, అధికార పార్టీ నాయకులు ఇటు వైపే చూడలేదని రైతును ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి జోగి రమేష్ ఎన్నికల అప్పుడు హడావిడి తప్ప, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు పట్టించుకునే సమయమే లేదా అని రైతుల తమ బాధని వెళ్లగకుతున్నారు. వరి కోతలు పూర్తయి, వరి పనలు నీటిలో ములగటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు, పొలాల్లో నీరు నిల్వ ఉండటం వల్ల మినుము పూర్తిగా పైరు కూడా దెబ్బతింది, వర్షం నీరు పోయేటందుకు మురికి కాలువలు సరిగా లేకపోవడం వల్ల ఎక్కువగా నష్టపోయామని రైతులు వాపోతున్నారు, తేమ శాతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, రంగు మారిన మొలకెత్తిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని, నష్టపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలని, ఎకరానికి 30 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో పెడన జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు, పుప్పాల పాండురంగారావు, ఎంటర్ పాట్టి నాగబాబు, గొట్రు రవి కిరణ్, మారు బోయిన సుబ్బు, డాక్టర్ శీను, కనపర్తి వెంకన్న, ఒగ్గు సాయి, పామర్తి వీర ప్రకాష్, పినిశెట్టి రాజు మరియు పెద్ద ఎత్తున జనసేన పాల్గొన్నారు.