జనసేన నాయకులు రామరాజు లంకకు చెందిన పిండి రామకృష్ణ-లక్ష్మీ దంపతుల కుమార్తె తేజ నాగశ్రీ పుట్టినరోజు సందర్భంగా సోమవారం రాజోలు మానసిక వికలాంగుల అనాథాశ్రమంలో భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. సమాజ సేవకు అంకితమై, ఎవరికైనా అవసరమైన సాయం ఉంటే వెంటనే స్పందించే రామకృష్ణ, పవన్ కళ్యాణ్ ఆశయాలను తన జీవిత విధానంగా మలుచుకున్నారు. ఈ సేవా కార్యక్రమంలో ఆశ్రమ చైర్మన్ లక్ష్మీ, జనసేన నాయకులు పంచదార చిన్నబాబు తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు వేడుకను ఆత్మీయతతో మానవ సేవగా మలిచిన ఈ కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలిచింది.
Share this content:
Post Comment