జంగాల కండ్రిగలో వెలుగులు నింపిన జనసేన

*20 ఏళ్ల చీకటాన్ని తొలగించిన కూటమి

నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం, జంగాల కండ్రిగ గిరిజన కాలనీ వాసుల 20 ఏళ్ల కల కూటమి ప్రభుత్వంతో నెరవేరింది. గత రెండు దశాబ్దాలుగా విద్యుత్ సౌకర్యం లేక చీకట్లో, విషపాముల భయంతో జీవనం సాగిస్తున్న గిరిజనులకు జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో వెలుగులు చేరాయి. ఇటీవల కాలనీని సందర్శించిన సురేష్ నాయుడు, స్థానికులకు ఆధార్ కార్డులు నమోదు చేయించడం, సింగిల్ ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయించడం, కొందరికి మీటర్ల ఖర్చులు భరించడం, వీధి లైట్ల ఏర్పాటు ప్రతిజ్ఞ చేయడం ద్వారా గిరిజనుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ సేవా కార్యక్రమంలో మోత్కూరు మండల సీనియర్ నాయకులు రహీం, బోలా అశోక్, సందూరి శ్రీహరి, సుమన్ చిన్న తదితరులు పాల్గొన్నారు. వెలుగుల్లోకి అడుగుపెట్టిన గిరిజనులు ఆనందంతో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

Share this content:

Post Comment