ఏలూరులోని పలు కాలువల నుండి వ్యర్ధాలతో కూడుకున్న విషపు నీరు కొల్లేరుకు వస్తుందని దీంతో పర్యావరణం దెబ్బతింటుందని జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార వికాస విభాగం వైస్ చైర్మన్ మోరు వెంకట నాగరాజు, దెందులూరు నియోజకవర్గం జనసేన పార్టీ అధికార ప్రతినిది తాతపూడి చందు ఆరోపించారు. జిల్లా కలెక్టర్ ఆఫీసులో ఫిర్యాదు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఏలూరు నలుమూలల నుండి తమ్మిలేరులోకి వ్యర్థాలు డ్రైన్లు ద్వారా వెళ్లి అది కొల్లేరులోకి ప్రవహించడం వల్ల పర్యావరణం, దెబ్బతింటుంది ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు అన్నారు అంతే కాకుండా పర్యావరణం కాపాడే బాధ్యత ప్రజలపై ఉందని గుర్తుచేశారు తమ్మిలేరు బ్రిడ్జ్ ల కింద కాలువలో అనేక వ్యర్థాలు పేరుకుపోయాయని, శుభ్రపరచాలని అధికారులకి విజ్ఞప్తి చేశారు.
Share this content:
Post Comment