కైకలూరులో దూసుకుపోతున్న జనసేన

  • 10వ రోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత కిట్ల పంపిణీ

కైకలూరు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా పండగలాగ మొదలైన 10వ రోజు జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత కిట్ల పంపిణీలో భాగంగా కలిదిండి మండలం ఎస్.ఆర్.పి అగ్రహారం నల్లగొపుల చలపతికి కిట్టు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ రాష్ట్ర నాయకులు, కృష్ణా జిల్లా కార్యవర్గం, కైకలూరు నియోజకవర్గ నాయకులు, కలిదిండి మండల కార్యవర్గం తదితర జనసైనికులు, జనసేన అభిమానులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ 2024 సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా అందరం కలిసి పని చేద్దామని అన్నారు.