రాజానగరంలో జనసేన మహా పాదయాత్ర

  • డ్రైనేజి సమస్యను పరిష్కరించవలసిందిగా కోరిన స్థానికులు

రాజానగరం, నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ మరియు వారి సతీమణి, ‘నా సేన కోసం నా వంతు’ కో ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మిల ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “జనసేన మహా పాదయాత్ర” బుధవారం రఘుదేవపురం గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రఘుదేవపురం గ్రామంలో వడ్డిగూడెం వెళ్లే రహదారిలో గత 5 సంవత్సరాలుగా ప్రధాన సమస్య అయిన డ్రైనేజి విషయంలో పంచాయితీ నిర్లక్ష్యం వల్ల స్థానికులు అనారోగ్యాలకు గురియై స్థానికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ సమస్యను త్వరగా పరిష్కరించాల్సిందిగా రాజానగరం జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణని స్థానికులు కోరడం జరిగింది.

  • రఘుదేవపురంలో జనసేనలో చేరికలు

రఘుదేవపురం గ్రామంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అశయాలు, సిద్ధాంతాలు నచ్చి వైసీపీ మరియు టీడీపీ కి సంబంధించి 50 మంది మహిళలు బత్తుల బలరామకృష్ణ, బత్తుల వెంకటలక్ష్మిల ఆధ్వర్యంలో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీరికి నాయకులు జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది.

రఘుదేవపురం గ్రామంలో కర్రి ఉమా మహేశ్వరరావుకి ప్రమాదవశాత్తు కాలు విరగడం జరిగింది. వారిని రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ పరామర్శించి మనోధైర్యాన్నివ్వడం జరిగింది.

రాపాక గ్రామంలో కడు పేదరికం అనుభవిస్తున్న సుంకర బాబూరావు పరిస్థితి చూసి చలించిపోయి ఆర్థిక సహాయం చేసి భవిష్యత్తులో అతనికి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తామని రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ హామీ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారికి సుంకర బాబూరావు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి, మండల సీనియర్ నాయకులు మట్టా వెంకటేశ్వరరావు, కోనే శ్రీను, ముత్యాల హరీష్, దాసరి కోటేశ్వరరావు, కవల గాంగారావు, దాసరి రమేష్, బొబ్బిరెడ్డి సూరిబాబు, యేపుగంటి శీను, ప్రగడ శ్రీహరీ మరియు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.