గ్రామ గ్రామానికి జనసేన మేనిఫెస్టో, సిద్ధాంతాల పరిచయ కార్యక్రమం

  • తోట వారి పాలెంలో పర్యటించిన చీరాల నియోజకవర్గ జనసేన యువత

చీరాల నియోజకవర్గం: గ్రామ గ్రామానికి జనసేన మేనిఫెస్టో, సిద్ధాంతాల పరిచయ కార్యక్రమంలో భాగంగా చీరాల నియోజకవర్గ జనసేన యువత ఆదివారం తోట వారి పాలెం గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా భారతదేశ మాజీ ప్రధానమంత్రి గౌరవ అటల్ బిహారీ వాజపేయి జయంతి సందర్భంగా మరియు సుపరిపాలన దినోత్సవం సందర్భంగా ఆయన చిత్రపటానికి చీరాల పట్టణ వాడరేవు బస్టాండు నందు ఉన్న జనసేన పార్టీ జెండా దగ్గర జనసేన పార్టీ యువత నివాళులర్పించడం జరిగింది. తదనంతరం జనసేన యువత అంతా బైక్ ర్యాలీగా తోటవారిపాలెంలోనీ ప్రతి వీధిలో పర్యటించడం జరిగింది. ర్యాలీ అనంతరం గ్రామంలో ఉన్న అమ్మవారి గుడి నందు కార్యకర్తలు అంతా సమావేశమవ్వడం జరిగింది. సమావేశంలో స్థానిక జనసేన యువత మాట్లాడుతూ చీరాల నియోజవర్గానికి వీలైనంత త్వరగా ఇన్చార్జిని నియమించాల్సిన అవసరం ఉన్నది అని బలంగా చెప్పడం జరిగింది. ఇన్చార్జి వచ్చే విధంగా ప్రయత్నం చేయవలసిన ఆవశ్యకత ను వివరించదం జరిగింది.
స్థానిక జనసేన యువత మాట్లాడిన అనంతరం కర్ణ కిరణ్ తేజ మాట్లాడుతూ 154 రోజులలో “పవనన్న చేనేత బాట” అనే కార్యక్రమం ద్వారా వేటపాలెం మండలం మొత్తం ప్రతీ చేనేత కుటుంభం దగ్గరకు వెళ్ళి ఆ కుటుంబ సమస్యలతో పాటు, స్థానికంగా ఉన్న సమస్యలను ఏ విధంగా సేకరించబడినవో ఆ విధానంలో జనసేన పార్టీ మేనిఫెస్టో మరియు సిద్ధాంతాలను ఏ విధంగా ప్రచారం చెయ్యడం జరిగిందో వివరించడం జరిగింది. స్థానిక జనసైనికులు నియోజకవర్గానికి ఇన్చార్జి విషయంలో లేవనెత్తిన సమస్య గురించి మాట్లాడుతూ ఇన్చార్జిని నియమించడం అనేది పార్టీ హై కమాండ్ పరిధిలో ఉన్న ఆంశము. ఇన్చార్జి వచ్చేంత వరకు మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు గ్రామ గ్రామానికి జనసేన పార్టీనీ తీసుకు వెళుతూ బూత్ స్థాయిలో బలోపేతం చేద్దాం. యువత తలుచుకుంటే బలమైన మార్పులు తీసుకు రావచ్చు. ప్రస్తుతం చీరాల నియోజకవర్గంలో జనసేన పార్టీని బలపరిచవలసిన ఆవశ్యకత యువత మీద ఉన్నది అని చెప్పడం జరిగింది. చీరాల నియోజకవర్గంలో యువత ద్వారా జరుగుతున్న కార్యక్రమాల ద్వారా జనసేన పార్టీకి స్పందన బాగున్నది అనే సమాచారం అధిష్టానం దగ్గరికి వెళితే వీలైనంత తొందరలో ఇంచార్జ్ ను నియమించే అవకాశం ఉన్నది అని చెప్పడం జరిగింది. గ్రామ గ్రామానికి జనసేన మేనిఫెస్టో, సిద్ధాంతాల పరిచయ కార్యక్రమం కోరకు రాబోయే రెండు నెలలకు సంబంధించి బలమైన కార్యచరణ సిద్ధం చేయడం జరిగింది. ప్రతి ఆదివారం జరిగే గ్రామ గ్రామానికి జనసేన పార్టీ మేనిఫెస్టో మరియు సిద్ధాంతాల పరిచయ కార్యక్రమంలో భాగంగా ఒక వారం రోజులు ముందు పర్యటించబోయే గ్రామాన్ని నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో ఉన్న జనసైనుకులకు తెలియపరచడం జరుగుతుంది. అందరు వారంలో కొంత సమయం కేటాయిస్తే ఖచ్చితంగా జనసేన పార్టీ చీరాల నియోజకవర్గంలో బలపరచిన వాళ్ళలో మనం కూడా భాగస్వాములై ఉంటాము అని చెప్పడం జరిగినది. ఈ కార్యక్రమంలో సుంకర నాగ హరీశ్, సానక నాగరాజు, గండురి రాజశేఖర్, బావిరెడ్డి తులసిరాం, మల్లెల శంకర్ నాయుడు, సానాక శివ సాయి, సుంకర కార్తిక్, తుమ్మల పెంట భార్గవ్, దేగల నాగ సాయి, గద్ద సాయి గణేష్ లతో పాటు రామాంజనేయులు, బాలు (బాలాజీ), పింజల సంతోష్, దొగుపర్తీ లలిత్ కుమార్, సోమిశెట్టి కిరణ్, కర్ణ కిరణ్ తేజ్ మరియు తోట చక్రీ (అశోక్ చక్రవర్తి) పాల్గొన్నారు ఈ కార్యక్రమం విజయవంతమవడానికి సహకరించినటువంటి తోటవారి వారి పాలెం గ్రామ ప్రజలందరికీ చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసారు.