జాలరి కుటుంబాలతో జనసేన మాటామంతి

కాకినాడ సిటి: జనసేన పార్టీ పి.ఏ.సి సభ్యులు మరియు కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ పర్లోవపేటలోని జాలరి కుటుంబాలను కలిసి మాటామంతి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంలో ముత్తా శశిధర్ స్థానిక జాలరులతో తనకుటుంబానికున్న అనుబంధాన్ని నెమరువేసుకుని పేరుపేరునా వారిని పలకరించారు. శశిధర్ వారితో మాట్లాడుతూ ప్రస్తుతం వారి పిల్లలు ఏమి చేస్తున్నారు చదువులు ఎంతవరకూ వచ్చాయనీ, కుటుంబ పరిస్థితులపై ఆరాతీసారు. స్థానిక జాలరులు మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా సహాయం లేదనీ, తుఫానులకీ ప్రమాదాలకీ నష్టపోతే సరైన పరిహారం లేదన్నారు. దీనికితోడు కుంభాభిషేకం ప్రాంతంలో తమ వేటని అమ్ముకొనేందుకు రానివ్వడంలేదని వాపోయారు. ప్రభుత్వ సంక్షేమ పధకాలలో రకరకాల కారణాలు చూపి లబ్దిదారులుగ నిరాకరిస్తున్నారని ప్రభుత్వం మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేసారు. ఇవన్నీ విన్న శశిధర్ మాట్లడుతూ మాయమాటలు చెప్పి మోసపూరిత హామీలు ఇచ్చి అధికారాన్ని పొందాడనీ ఈ జగన్మోహన్ రెడ్డి, అవసరం తీరిపోయింది కాబట్టి మీచావు మీరు చావండి అనేలా ప్రవర్తిస్తున్నాడనీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. లోగడ వేట నిషేధ సమయంలో మత్స్యకారులకి వేటభృతి నిమిత్తమై జాబితాలో జరుగుతున్న అన్యయంపై నాదెండ్ల మనోహర్ గారు, తాను ఫిషరీస్ కార్యాలయం ముట్టడించి ధర్నా చేసి న్యాయం చేయాలని పోరాడామనీ ఇంకా కొంతమందికి న్యాయం జరగలేదనీ ఈ సిగ్గుమాలిన ప్రభుత్వం హయాములో చర్యలు శూన్యమన్నారు. సముద్రంలో చనిపోయిన వారికి పరిహారం సరిగా ఇవ్వరు, వలలు వైగైరా సామగ్రికి సబ్సిడీలు లేవు, డీజిలు సబ్సిడీ సరిపోదు పెంచరు, ఇచ్చేది ఎపుడొస్తాదో తెలియదు ఒక్క మాటలో చెప్పాలంటే దోచుకో దాచుకో తప్ప ఇంకేమీ పట్టని ప్రభుత్వం మనం చూస్తున్నామన్నారు. జనసేన పార్టీ రాష్ట్రంలో ఉన్న మత్స్యకారుల ప్రయోజనాల కోసం రాజోలు సభలో కొన్ని తీర్మానాలు చేసామనీ వాటికోసం కృషిచేస్తామన్నారు. రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీల కూటమిని బలపరిచి గెలిపించి సుపరిపాలన పొందుదామని పిలుపునిచ్చారు.