నక్కపల్లిలోని టి. సుబ్బు రాంరెడ్డి కళ్యాణ మండపంలో గురువారం జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నియోజకవర్గ ఇన్‌చార్జ్ గెడ్డం బుజ్జి మాట్లాడుతూ, క్రియాశీలక సభ్యత్వం పార్టీ కార్యకర్త కుటుంబాలకు ఆర్థిక భరోసా వంటిదని పేర్కొన్నారు. అనంతరం నియోజకవర్గంలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన గెడ్డం చైతన్యను ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి బోడపాటి శివదత్తు, యువ నాయకుడు గెడ్డం చైతన్య, ఉమ్మడి విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవవరపు రఘు, సంయుక్త కార్యదర్శి పల్లి దుర్గరావు, మండల అధ్యక్షులు యగదాసు నానాజీ, వెలగా సుధాకర్ రావు, ఆచంట దొర, పప్పల శివ, ఎం.పి.టి.సి మాకినీడి చిట్టిబాబు తదితర ప్రజాప్రతినిధులు, వాలంటీర్లు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment