వడ్డిగూడెంలో జనసేన సభ్యత్వ కిట్ల పంపిణీ

వి.ఆర్.పురం మండలం వడ్డిగూడెం గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్లు, ఇన్సూరెన్స్ ఐడీ కార్డులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మండల మహిళా అధ్యక్షురాలు బాగుల ప్రమీలరాణి ఆధ్వర్యంలో, మండల అధ్యక్షులు ములకాల సాయికృష్ణ ప్రధాన అతిథిగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ అవినీతి లేని పాలనకు నిలయంగా మారి, గ్రామాల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్నారని ప్రశంసించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖలతో పాటు గిరిజనుల పట్ల ఆయన చూపిస్తున్న శ్రద్ధను కొనియాడారు. “పేదల కన్నీరు తుడిచే పార్టీ జనసేన,” అని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బాగుల అంజనరావు, సహాయ కార్యదర్శులు ముంజపు శ్రీరామ్, మాచర్ల వేణుబాబు, యూత్ నాయకులు పెడపెట్ల పవన్ కళ్యాణ్, ముంజపు సాయిరాం, గూటాల సమ్మరాజు, బొర్రా రాజేష్, గూటల పుల్లేష్, చోడే గంగాధర్, ముత్యాల సింహాద్రి, కోట్ల అమ్మాజీ, కడుపు కుమారి, కామేశ్వరి తదితర జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు. గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి ఈ కార్యక్రమం గొప్ప దిక్సూచి అయ్యింది.

Share this content:

Post Comment