జనసేన ముస్లిమ్ సచార్ యాత్ర

కాకినాడ సిటీ: జనసేన పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు మరియు కాకినాడ సిటీ ఇన్ ఛార్జ్ ముత్తా శశిధర్ ఆలోచనలతో గురువారం అనగా 2023వ తారీఖున 6వ డివిజన్ మసీదు ప్రాంతంలో జనసేన ముస్లిమ్ సచార్ యాత్ర డాక్టర్ బాబు ఆధ్వర్యంలో జరిగినది. ఈ పాంతంలోని ముస్లిం ప్రజలతో డాక్టర్ బాబు ముచ్చటిస్తూ గత కొన్నిరోజులుగా కాకినాడ సిటిలో సచార్ యాత్ర చేస్తున్నామనీ, ఇదేమిటంటే ముస్లింల కోసం సచార్ అనే ఒక కమిటీ ఏర్పడి కొన్ని సూచనలతో ఒక రిపోర్టుని సమర్పించిందనీ వాటికి చట్టబద్ధత కల్పించి అమలు చేయాలంటూ 2019లో పవన్ కళ్యాణ్ తమ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారనీ, మన రాష్ట్రంలో రెండుచోట్ల ముస్లింస్ ని స్వయంగా కలిసారనీ అందులో ఒకటి మన కాకినాడ అని గుర్తుచేసారు. కాకినాడలోని ముస్లింస్ని ఒక పార్టీ తమ సొంతం అనుకుంటొనదనీ అది తప్పనీ, కారణమేంటంటే గత 15 సంవత్సరాలుగా ముస్లింస్ ఏమి ఆస్థి సంపాదించుకున్నారని ప్రశ్నించారు. సొంతంగా ఇళ్ళు కట్టుకోగలిగారా, పొనీ వాళ్ళ మతపరమైన ఆస్థులు ఏవైనా పెరిగాయా అని ప్రశ్నిన్స్తూ 2009 తరువాత ఎలాంటిదీ లేదని, ముస్లింలకి ఆఖరుసారి రెవిన్యూకాలనీలో మసీదు కట్టింది ముత్తా గోపాలక్రిష్ణ హయాములో అని గుర్తుచేసారు. అప్పుడే కొత్త బరియల్ గ్రవుండ్ మంజూరు జరిగాయన్నారు. ఆతరువాత ఉన్న మసీదులపై మేడ వెసుకోడమో లేక జనరేటరో, ఏసి పెట్టుకోడమో తప్ప ఇంకేమీ జరగలేదన్నరు. 28 వేల ఇళ్ళూ ఇచ్చామని చెప్పుకుంటున్న ప్రభుత్వం అందులో ఎంతమంది ముస్లింలకు ఇళ్ళు ఇచ్చారో బహిర్గతం చేయాలన్నారు. ఇంతమంది ముస్లింలతో గృహప్రవేశం చేసామని చూపించండి మీతో వస్తాము అపుడు మీరు చేసారని ఒప్పుకుంటా అని అన్నారు. జనసేన పార్టీ ముస్లిం వర్గాల ప్రయోజనాలని కాపాడతాదని హామీ ఇస్తూ రాబోయే ఎన్నికలలో జనసేన పార్టీ తెలుగుదేశంల ఉమ్మడి ఆధ్వర్యంలోని కూటమికి మద్దతు ఇవ్వాలిసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ మొయినుద్దీన్, అజార్, రజాక్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.