సౌతాఫ్రికాలో స్థిరపడిన మన తెలుగువారు జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపుమేరకు ప్రేరేపితమై, జనసేన పార్టీని అక్కడ అధికారికంగా రిజిస్టర్ చేసి, ఎన్.ఆర్.ఐ జనసేన టీమ్‌గా ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని కొంతమంది నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా అండగా నిలవాలని, వారి పిల్లలకు ఉచిత విద్యను అందించి నిరక్షరాస్యతను పోగొట్టాలని సంకల్పించింది. అంతేకాకుండా, సౌతాఫ్రికాలో ఫిజికల్‌గా హ్యాండీక్యాప్డ్‌లు, ఓల్డ్ ఏజ్ హోమ్‌లకు అవసరమైన సేవలు అందిస్తూ, జనసేన సిద్ధాంతాలను పాటిస్తూ సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, శాసనమండలి సభ్యులు నాగబాబు ల ఆశీర్వాదం, ప్రోత్సాహంతో, పార్టీ నుంచి వచ్చే అన్ని ఆదేశాలకు కట్టుబడి ఉంటామని, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీకి తమవంతు సహకారం అందిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కమిటీలో సీతారామారావు కోనే చైర్మన్‌గా, శ్రీనివాసరావు గనిమిశెట్టి ప్రెసిడెంట్‌గా, అనిల్ సత్య పారేపల్లి డిప్యూటీ ప్రెసిడెంట్‌గా, రాజగోపాల్ పసుపులేటి జనరల్ సెక్రటరీగా, సుధీర్ బోనం సెక్రటరీగా, కాశీ ఈశ్వరి బచ్చు ట్రెజరర్‌గా బాధ్యతలు చేపట్టారు. అలాగే, ఎగ్జిక్యూటివ్ ప్యానల్ మెంబర్స్‌గా నిర్మల్ నల్లు, విష్ణు సాయి కోడె, మోహన్ కోన, కళ్యాణ్ బత్తిన బాధ్యతలు స్వీకరించారు. ఖండాలు దాటి జనసేన శబ్దాన్ని గర్వంగా వినిపించేస్తున్న ఈ సౌతాఫ్రికా టీమ్ సేవా దృక్పథంతో ముందుకు సాగుతోంది.
Share this content:
Post Comment